తమిళనాడులో టీచర్‌పై ప్రేమోన్మాది ఘాతుకం.. క్లాస్ రూంలో కత్తితో పొడిచి!

-

తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఆ సమయంలో టీచర్ క్లాస్ రూంలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తనను ప్రేమించాలని ప్రేమోన్మాది మదన్.. రమణి అనే ఉపాధ్యాయురాలి వెంట పడుతున్నట్లు సమాచారం. అందుకు ఆమె పలుమార్లు నిరాకరించడంతో కోపం పెంచుకున్న మదన్ ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు.

ఈ క్రమంలోనే తంజావూరులోని ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ చేస్తున్న రమణిపై బుధవారం పలుమార్లు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరగి అక్కడికక్కడే టీచర్‌ రమణి మృతిచెందింది. ఆమెను హాస్పిటల్ తరలించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రేమోన్మాది మదన్ కత్తితో పొడుస్తున్న దృశ్యాలను పిల్లలు కళ్లారా వీక్షించినట్లు తెలుస్తోంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్టాలిన్ సర్కార్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news