కర్నూలులో హైకోర్టు బెంచ్ పై శాసనసభలో తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరలో కర్నూలులో మైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాళ్ల సీమలా ఉండే రాయలసీమకు సాగునీరు ఇచ్చామని తెలిపారు.
నదుల అనుసంధానంతో రాష్ట్రమంతటా నీళ్లు అందిస్తామని వెల్లడించారు. రాయలసీమలో బెస్ట్ రోడ్డులు నిర్మించాం. రాయలసీమలో నాలుగు కీలక ఎయిర్ పోర్టులు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందులో ఓర్వకల్ లో ఎయిర్ పోర్టు నిర్మించాం. తిరుపతి, కడప ఎయిర్ పోర్టులు అభివృద్ది చేశామని తెలిపారు. మిషన్ రాయలసీమలో చెప్పినవన్నీ పూర్తి చేస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధిని చేస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.