ప్రతిష్టాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవీ చేపట్టిన తొలి వెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘటన సాధించారు.
అమలాపురం మాజీ ఎంపీ కేసీఆర్ మూర్తి కుమారుడు సంజయ్ మూర్తి. 1964 డిసెంబర్ 24న జన్మించిన ఆయన మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు ఎంపికై.. ఆ తరువాత కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పని చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. సంజయ్ సేవలను గుర్తించిన కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది.