IIT, IIM వంటి ప్రీమియం సంస్థల్లో చదువుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాన్ని వద్దనుకుని ఫోకస్ చేస్తున్నారు. అలాగే చాలామంది ఈరోజుల్లో బిజినెస్ కూడా చేస్తున్నారు. కిషోర్ ఇందుకూరి సక్సెస్ స్టోరీ చూశారంటే కచ్చితంగా చప్పట్లు కొడతారు. హైదరాబాదులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. హైదరాబాద్ లో డయిరీని ప్రారంభించాలని అమెరికాలో ఇంటెల్ లో మంచి జాబ్ ని వదిలేసుకున్నారు. నలంద విద్యాలయ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశారు.
లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో 12వ తరగతి చదువుకున్నారు. ఐఐటి ఖరగ్పూర్ నుంచి కెమిస్ట్రీలో బిఎస్సి చేసి తర్వాత అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తర్వాత ఇంటెల్ లో జాబ్ వచ్చింది కానీ ఇండియా తిరిగి రావాలనుకున్నారు. ఆరేళ్ల పాటు పని చేసిన తర్వాత హైదరాబాద్ కి వచ్చి అనేక వ్యాపారాల్లో స్టార్ట్ చేశారు. సురక్షితమైన పాలు తక్కువ ధరకే అమ్మడం వంటివి చేశారు. 2012లో 26 ఆవులతో డైరీని ప్రారంభించారు. మొదట్లో లీటర్ ని 15 రూపాయలకే విక్రయించారు. ఖర్చు 30 అవుతోందని తర్వాత గ్రహించారు.
తర్వాత కమ్యూనిటీ సెంటర్స్ హౌసింగ్ సొసైటీలను సందర్శించారు. ప్రజలతో కనెక్ట్ అయ్యారు. శుభ్రమైన పాల గురించి తెలుసుకున్నారు. అవగాహనని కూడా కల్పించారు. 2018 లో ఇందుకూరి డైరీ ఫామ్ హైదరాబాద్ లోని పెద్ద పాల సరఫరాదారిగా మారింది. 1500 మంది రైతుల నుంచి పాలను సేకరించి 6000 మంది వినియోగ్యులకు 25 లీటర్ల పాలని విక్రయిస్తున్నారు. సిద్స్ ఫామ్ పేరుతో కంపెనీ నడుస్తోంది టర్నోవర్ ఏడాదికి 44 కోట్ల చేరుకుంది. పాలు, పాల పదార్థాలని విక్రయిస్తున్నారు. హైదరాబాద్ కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాబాద్ లో నాలుగు ఎకరాల పొలాన్ని కొన్నారు. చుట్టుపక్కల ఉన్న రైతులు నుంచి పాలను సేకరించి పాలను పొలానికి రవాణా చేస్తున్నారు.