బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి విరుచుకపడ్డారు. కేటీఆర్ నీ ఎజెండా అదైతే నీ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని సవాల్ విసిరారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
‘కేటీఆర్ నీ ట్విట్టర్ ఖాతాలో రాసిన సుత్తి “కపిత్వం” గురించి వినే ఓపిక, తీరిక తెలంగాణ సమాజానికి లేదు. అలాగే నీ జెండా.. నీ ఎజెండా.. నిజంగానే తెలంగాణనే ఐతే, నీకు నా సవాల్!.. నీ పార్టీ పేరును మళ్లీ “తెలంగాణ” రాష్ట్ర సమితిగా మార్చు అని’ పిలుపునిచ్చారు. కాగా, నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ పై కేటీఆర్ స్పందిస్తూ..‘పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో.. తెలంగాణ పౌరుడిగా 28 సార్లు పోయినవ్, 28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యత’ అని రాసుకొచ్చాడు.