వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటన చేశారు. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా కేంద్రమంత్రి రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు . వరంగల్లో కచ్చితంగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కేంద్రమంత్రి రామ్మోహన్.
వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుకు ఆదనంగా కొత్తగూడెం దగ్గర ఎయిర్పోర్ట్కు అనువైన స్థలం ఉందని సీఎం చెప్పారన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్. త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్. పెద్దపల్లిలో విమనాశ్రయం ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పారు కేంద్రమంత్రి రామ్మోహన్.