ఇటీవలి కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు పెరిగిపోయాయి. కొందరు ప్రేమించి తమ లైంగిక వాంఛలు తీరగానే మోహం చాటేస్తున్నారు. దీంతో అవతలి వారు వారిద్దరు ప్రేమలో ఉన్నప్పుడు కలిసి దిగిన ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేస్తామని, లేదంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నారు.
ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ పరువుపోతుందని కొందరు చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సమస్యలను అటు మగ, ఆడవారు సైతం ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు ఇటువంటి బెదిరింపులకు భయపడొద్దని ధైర్యంగా ఫిర్యాదు చేయాలని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. బాధిత వ్యక్తుల వివరాలు సైతం గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. గతంలో, ప్రస్తుతం ఎవరైనా ఇలా బ్లాక్ మెయింగ్కు బాధితులు ఉంటే తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.2
ప్రేమ, పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్ చేసే వారికి భయపడొద్దు
మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో బెదిరించేవారిపై ధైర్యంగా ఫిర్యాదు చేయండి
బాధితులకు తెలంగాణ పోలీసులు అండగా ఉంటారు
బాధితుల వివరాలు ఎక్కడా బహిర్గతం అవకుండా జాగ్రత్త తీసుకుంటారు.#TelanganaPolice #Dail100 #BeAlert pic.twitter.com/5bjhwsEWKw— Telangana Police (@TelanganaCOPs) November 28, 2024