నేను ఎక్కడికీ పారిపోలేదు.. తప్పు చేస్తే జైలుకెళ్తా అంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ…అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడ సినిమా కథలు రాసుకుంటా అంటూ ఈ సందర్బంగా ప్రకటించారు. ప్రకాశం జిల్లా పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదని వెల్లడించారు. వాళ్లు కనీసం నా ఆఫీస్ లోపలికి కూడా రాలేదని చెప్పారు.
ఏదో జరిగిపోయిందని జనాలంతా ఫోన్ చేసి సానుభూతి తెలియజేస్తుంటే అదంతా వినలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాను అంటూ కామెంట్స్ చేశారు. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికే అన్నారు ఆర్జీవీ. నా సినిమాలైనా… నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమేనని… నా పోస్టులు, సినిమాలు ఎవరినీ కించపర్చడానికి కాదని క్లారిటీ ఇచ్చారు.
నేను ఎక్కడికీ పారిపోలేదు.. తప్పు చేస్తే జైలుకెళ్తా: ఆర్జీవీ
అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడ సినిమా కథలు రాసుకుంటా
ప్రకాశం జిల్లా పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు
వాళ్లు కనీసం నా ఆఫీస్ లోపలికి కూడా రాలేదు
ఏదో జరిగిపోయిందని జనాలంతా ఫోన్ చేసి సానుభూతి తెలియజేస్తుంటే అదంతా… pic.twitter.com/1bvWurjSDd
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2024