వివాహేతర సంబంధం, పరాయి వ్యక్తి మోజులో పడి కొందరు మహిళలు తమ కుటుంబాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. దీనికి తోడు తమ సంతోషానికి అడ్డు తగులుతున్నాడని కొందరు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్నారు.ఇటువంటి ఘటనలు సమాజంలో క్రమంగా పెరుగుతున్నాయి.ఇటువంటి ఘటనే తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగుచూసింది.
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ (35) బిజినపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.తన భార్య కీర్తి ‘ఎస్బీఎం’ అనే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పనిచేస్తూ బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉండేది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త మందలించడంతో ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని భార్య పథకం రచించింది.ఈ క్రమంలోనే ప్రియుడి మోజులో పడిన మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చి అనంతరం కాలువలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది.