మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని రోటిగూడ గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కుమార్తై సమన్విత స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చిన్నారి తల్లిదండ్రులకు తెలిపింది.
దీంతో తల్లిదండ్రులు తమ కూతురుని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పరిశీలించిన వైద్యులు తెలిపారు. చిన్న వయసులో కూతురు మరణాన్ని తట్టుకోలేని బాధిత తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. చిన్నారి గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు చెప్పడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు.చిన్నారి మృతి స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.