తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధే..ఆమె చలవతోనే : మంత్రి పొన్నం

-

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని, ఆమె చలవతోనే రాష్ట్రం సిద్ధించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు చలించి సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, సోనియా ఇవ్వకపోతే తెలంగాణ ఏర్పడేదా? అని బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి సూచించారు. మాస శివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న పొన్నం.. స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు జరిపారు.

కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్ర స్వామి ఆలయానికి రూ. 10 లక్షలతో మెట్ల మార్గానికి శంఖు స్థాపన చేశారు.అనంతరం నూతన పల్లె దవాఖానను ప్రారంభించారు.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పట్ల అంతా కృతజ్ఞతతో ఉండాలన్నారు. తెలంగాణ సాధనకు ఎందరో బలిదానం చేశారని, సకల జనులు ఉద్యమించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ , కేసీఆర్ ఒక్కడే పోరాడితే తెలంగాణ రాలేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటులో ఆనాడు తెలంగాణ బిల్లు పెట్టారన్నారు.ప్రధాని మోడీ మాత్రం తల్లిని చంపి బిడ్డను ఎత్తుకుపోయారని ఆక్షేపించారని పొన్నం విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news