మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్ లో పేరు లేదు అంటున్నారు అని మాజీ మంత్రి, టిడిపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలి. అదానీ డబ్బు నువ్వు తినకపోతే ఎవ్వరూ తిన్నారు నువ్వే చెప్పు. జగన్ నిజమైన క్రైస్తవుడు కాదు ఈస్టిండియా కంపెనీ లాగా, వారన్ హెస్టింగ్స్ లాగా రాష్ట్రప్రజలను దోచుకున్నాడు. ఈ ఒప్పందాల్లో పోరపాటు జరిగింది డబ్బు తిన్నాను అని ఒప్పుకో. జగన్ పేరు కచ్చితంగా ఛార్జిషీట్ లో వుంది అందులో ఎలాంటి అనుమానం లేదు.
మోసానికి చొక్క్ ప్యాంట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుంది. సెకీతో ఒప్పందాన్ని చూపి తప్పించుకోవలనుకుంటే కుదరదు. ఇక్కడి పోలీసుల నుండి మాయచేసి తప్పించుకున్నా అమెరికాలో జగన్ కు శిక్ష తప్పదు. జగన్ నువ్వు తప్పు చేయకపోతే ఒక సారి అమెరికా వెళ్ళి రావాలని సవాలు విసురుతున్నా. ఈ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అదాని కేసు వ్యవహారం పై పార్లమెంట్ లో చర్చ జరుగాలి అని వరప్రసాద్ పేర్కొన్నారు.