కేటీఆర్‌కు బిగ్‌షాక్.. ప్రధాన అనుచరుడు అరెస్టు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రధాన అరుచరుడిగా ఉండే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దపూర్‌లో కేటీఆర్ ప్రధాన అనుచరుడు బొల్లి రామ్మోహన్ అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి,చాలా కాలంగా కంకర క్వారీ నిర్వహిస్తున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బొల్లి రామ్మోహన్‌ను శనివారం తెల్లవారుజామున సిరిసిల్ల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా, ట్రాక్టర్ అసోసియేషన్, ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన రామ్మోహన్ ఇసుక మాఫియా, భూములు కబ్జా చేస్తూ రూ.కోట్లు దండుకున్నాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రామ్మోహన్ అరెస్ట్ జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news