దువ్వాడతో కొడుకును కంటానంటూ సంచలన ప్రకటన చేశారు మాధురి. తాజాగా దువ్వాడ శ్రీను, మాధురి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తన ఫీలింగ్స్ మొత్తం చెప్పేశారు. నేను దువ్వాడ మాధురిగానే ఉండేందుకు ఇష్టపడతాను అంటూ తెలిపారు దివ్వెల మాధురి.
కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటామని ప్రకటించారు. మాధురి లేకుండా దువ్వాడ లేరన్నారు. ఇక అటు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ… రచ్చ గెలిచాను.. కానీ ఇంట గెలవలేకపోయానని తెలిపారు. తన వైవాహిక జీవితంలో దువ్వాడ వాణితో జరిగిన సంఘర్షణను చెప్పిన దువ్వాడ శ్రీనివాస్… 2003లో వైఎస్ఆర్, 2024లో వైఎస్ జగన్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే నా భార్యే పోటీకి వచ్చిందన్నారు. నేను కాంగ్రెస్ లో ఉండగా ధర్మాన ప్రసాదరావు నన్ను సస్పెండ్ చేయించారని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత గతి లేక పీఆర్పీలో జాయిన్ అయ్యానని తెలిపారు.