ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు రెండ్రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ సోదాల తర్వాత ఆయన్ను అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ఏఈఈ నిఖేష్‌ను న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచగా..డిసెంబర్ 13వ తేదీ వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధించారు.
అనంతరం నిఖేష్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.ఇక నిఖేష్ ఇంటితో పాటు బంధువుల నివాసాల్లో ఏకంగా 25 నుంచి 30 చోట్ల సోదాలు జరిపిన అధికారులు..దాదాపు రూ.200 కోట్ల మేర అక్రమ ఆస్తులను గుర్తించారు. కాగా, గతంలోనూ నిఖేశ్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.