వైఎస్సార్‌సీపీ చంద్రగిరి సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చెవిరెడ్డిపై అసలు తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధిత బాలిక తండ్రి మీడియాకు వివరించారు.తిరుపతి జిల్లాలో ఇటీవల ఓ బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ బాలికను పరామర్శించేందుకు వెళ్లిన చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది.
తాజాగా నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. తాము ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిపై తామెందుకు కేసు పెడతామని బాలిక తండ్రి రమణ పేర్కొన్నారు. అత్యాచార ఘటనపై అసత్య ప్రచారం జరుగుతుందని, పోలీసులే సంతకం పెట్టించుకున్నారన్నారు. దీంతో అసలు బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారెవరనేది అనేది ప్రశ్నార్థకంగా మారింది.