ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అర్థరాత్రి 1.50 గంటల నుంచి ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్రీమియర్ షోలకు టికెట్ ధరలను భారీ పెంచేశాయి థియేటర్లు. పెంచిన ధరలు కూడా నిర్మాతలకే చేరనుండటం విశేషం. గతంలో ప్రీమియర్ షో లకు వచ్చిన అమౌంట్ ను థియేటర్ల యజమాన్యం తీసుకునేది.
ప్రస్తుతం ట్రెండ్ మారిపోయిందనే చెప్పాలి. ఇదిలా తాజాగా పుష్ప-2 టికెట్ల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పై కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. ప్రీమియర్లకు టికెట్ ధరపై రూ.800 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 05 నుంచి 08 వరకు రూ.200, ఆ తరువాత కూడా పెంపునకు అనుమతిచ్చిన విషయం విధితమే. అయితే తెలంగాణ హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో వేచి చూడాలి మరీ.