ఏపీలో వైసీపీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలోకి ఆళ్ల నాని చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ రోజు కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీ పెద్దలు, ఆళ్ల నానితో మంతనాలు జరిపి చేరికకు ఒప్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. అయితే… నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి ఆళ్ల నాని చేరేందుకు రంగం సిద్ధం కాగా.. తెలుగు తమ్ముళ్లు మాత్రం… అతని రాకను వ్యతిరేకిస్తున్నారట. కాగా ఇటీవలే వైసీపీ పార్టీకి ఆళ్ల నాని రాజీనామా చేశారు.