పుష్ప 2 .. టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు !

-

పుష్ప 2 కు బిగ్‌ షాక్‌.. టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. ఇవాళ పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై తెలంగాణ హైకోర్టు లో విచారణ చేసింది.

Big shock for Pushpa 2 Key orders of Telangana High Court on ticket prices

బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారని పుష్ప 2 టీంను పిటిషనర్ ప్రశ్నించారు. ఇక దీనిపై విచారించిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, పుష్ప 2 టీంకు చంద్రబాబు సర్కార్‌ శుభవార్త చెప్పింది. పుష్ప 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రలో కూడా ఒకరోజు ముందే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు పుష్ప ప్రీమియర్ షోస్ ఉండనున్నాయి.

ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 హైక్ చేసింది ఏపీ సర్కార్‌. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ కంటే రూ.200 అధికంగా హైక్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100 అధికంగా పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news