రైతులను మోసం చేయడమే విజయోత్సవాలా? : బండి సంజయ్

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇవి ప్రజాపాలన విజయోత్సవాలు కావని వికృత ఉత్సవాలు అని ఫైర్ అయ్యారు. ‘ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ దృష్టిలో పిల్లలకు పురుగుల అన్నం పెట్టడం అతిపెద్ద విజయమని.. వారి చావులు ఉత్సవమని, యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయమని, వారికి సంకెళ్లేయడం ఉత్సవమని దుయ్యబట్టారు.

రైతులను మోసం చేయడం విజయమని.. వారికి ఉరితాళ్లేయడం ఉత్సవమని, ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయం..వారి కన్నీళ్లు ఉత్సవం, ఇండ్లు ఇస్తామని మోసం చేయడం విజయం..ఉన్న ఇండ్లు కూల్చడం ఉత్సవం..రుణమాఫీ చేస్తామని మాట తప్పడం విజయం..అప్పులకు నోటీసులివ్వడం ఉత్సవమని’ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news