అక్కినేని నాగచైతన్య- శోభిత బుధవారం మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్థూసియోస్ వేదికగా కుటుంబ సభ్యులు,సన్నిహితుల మధ్య రాత్రి 8 గంటలకు వివాహం జరగనుంది. వీరి పెళ్ళికి చిరంజీవి, రామ్‌చరణ్, మహేష్, ప్రభాస్, రాజమౌళి ముఖ్య అతిథులుగా సందడి చేయనున్నారు. ఇదిలాఉండగా, అక్కినేని నాగచైతన్యకు ఇది రెండో వివాహం.
గతంలో సమంతను ప్రేమవివాహం చేసుకున్న చైతన్య.. మనస్పర్దల కారణంగా మ్యుచువల్‌గా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ శోభితను చైతూ రెండో వివాహం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో వీరిద్దరి వివాహం నిర్వహిస్తున్నట్లు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ఇదిలాఉండగా, సమంత ప్రస్తుతం ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోంది.