Australia vs India, 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా.. !

-

అడిలైడ్‌లోని ఓవల్‌లో జరుగుతున్న పింక్‌ టెస్ట్‌ లో టీమిండియా టాస్‌ నెగ్గింది. రెండో మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఆతిథ్య జట్టు 295 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇక అటు ఈ రెండో మ్యాచ్‌ కు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌ లు అందుబాటులోకి వచ్చారు. అయితే.. రోహిత్ నం. 3లో బ్యాటింగ్ చేస్తాడు, విరాట్ కోహ్లీ, గిల్‌లు వరుసగా 4 మరియు 5వ ర్యాంక్‌లో వస్తారని రోహిత్‌ ప్రకటన చేశారు. KL రాహుల్‌, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా బరిలో దిగనున్నారు.

IND wins toss and opts to bat first in Adelaide

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), రోహిత్ శర్మ(c), నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

 

Read more RELATED
Recommended to you

Latest news