Shock for BRS Harish Rao House Arrested: BRSకు షాక్ తగిలింది…మాజీ మంత్రి హరీష్ రావు హౌజ్ అరెస్ట్ అయ్యాడు. నార్సింగి పూపాలగూడ క్రిన్స్ విల్లా వద్దకు చేరుకున్న పోలీసులు….హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ట్యాంక్ బండ్ పై నిరసనలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ తరునంలోనే… బీఆర్ఎస్ అందరూ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఇంటి వద్ద హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.. ఎమ్మెల్యేలు ముఖ్య నేతల్ని బయటికి రాకుండా పోలీసులు పూర్తిస్థాయిలో కాపలా ఉన్నారు. నిన్న ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.. ఇందులో పాల్గొనేందుకు వచ్చే నాయకులందరినీ వాళ్ళ ఇళ్ల వద్దనే హౌస్ అరెస్టు చేసి పెట్టారు. ఇందులో భాగంగానే.. .మాజీ మంత్రి హరీష్ రావు హౌజ్ అరెస్ట్ అయ్యాడు.