రాజ్యసభలో రూ. 500 నోట్ల కట్టలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అంశంపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ. నేను మొదటిసారి విన్నా. ఇలాంటిది ఇప్పటివరకు ఎప్పుడూ వినలేదని అంటూ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. నేను ఎప్పుడు రాజ్యసభకు వెళ్ళినా జేబులో రూ. 500 నోటు ఒక్కటే పెట్టుకుంటానని వెల్లడించారు.
నేను రాజ్యసభకు 12.57కు చేరుకున్నాను. మధ్యాహ్నం గం. 1.00కు సభ వాయిదా పడిందని తెలిపారు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ. నేను అప్పటి నుంచి 1.30 వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కేంటీన్‌లో కూర్చొన్నానని వివరించారు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ. ఆ తర్వాత అక్కణ్ణుంచి వెళ్లిపోయాను అంటూ సింఘ్వీ ట్వీట్ చేశారు.
కాగా, రాజ్యసభలో డబ్బుల దుమారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద డబ్బులు దొరికాయినట్లు తాజాగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ అధికారిక ప్రకటన చేశారు.