రేపు కడపకు పవన్ కళ్యాణ్..అన్నమయ్య కూడలిలో భారీ సభ

0
134

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా కడప జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి నేరుగా కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడనున్నారు.

డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కడప జిల్లాకు రానుండటంతో జనసైనికుల్లో నూతనోత్సాహం నెలకొంది. పవన్ పర్యటన గురించి ముందస్తు సమాచారం రావడంతో స్వయంగా కడప జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతేకాకుండా స్థానికంగా ఉండే కళాశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆ పరిసరాలను పరిశీలించి భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోదాలో వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.