కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

-

కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కడప-పెండ్లి మర్రి సెక్షన్ల మధ్య లైన్ పూర్తి అయినట్టు వెల్లడించారు మంత్రి. ఇప్పటి వరకు రూ.359 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ పై  వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక జవాబు ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ రైల్వే లైన్ కోసం రూ.2706 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటివరకు రూ.359 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొత్త లైన్ కోసం సర్వే కోసం ఆమోదం తెలిపాం. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-
శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం మీదుగా కడప నుంచి ఈ లైన్ వెళ్తుంది అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news