రన్నింగ్ జాయింట్ వీల్ నుంచి జారిన యువతి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని!

-

సరదా కోసం జాయింట్ వీల్ ఎక్కిన యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. వీల్ తిరుగుతూ పైకి వెళ్లిన క్రమంలో యువతి అనుకోకుండా సీటులో నుంచి జారి పడబోతుండగా మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుని వేలాడింది. అక్కడ ఉన్నవారంతా భారీగా కేకలు వేయడంతో జాయింట్ వీల్ నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు.

 

వెంటనే జాయింట్ వీల్‌ వేగాన్ని తగ్గించి,మెల్లగా యువతి కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో యువతి ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. యువతి ఎట్టకేలకు క్షేమంగా ప్రాణాలతో బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యువతి జారిపోవడానికి సీటింగ్ ప్రాబ్లమా? యువతికి కళ్లు తిరిగాయా? అనేది తెలియరాలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కూడా తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news