ఆదిలాబాద్ రైతులను నిండా ముంచిన వర్షం.. చేతికొచ్చేలోపే నీళ్ల పాలు

-

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అకాల వర్షాలు ముంచెత్తాయి.దీంతో ఆరుగాలం పంట పండించి ఇవాళో రేపో తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని భావించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. పండిన ధాన్యాన్ని రోడ్లు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసి అమ్ముకుందామనుకునేలోపే అనుకోకుండా భారీ వర్షం కురిసింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం మొత్తం తడిసింది. కష్టపడి పండించిన పంట చేతికొచ్చేలోపు వర్షం తమకు కడుపుకోత మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాలు లేకుండా, తడి లేకుండా తీసుకురావాలని అధికారులు షరతులు పెట్టడంతో ధాన్యం ఆరబోసామని ఇప్పుడు ధాన్యం మొత్తం వర్షం పాలైందని బోరున విలపిస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news