విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు చేశారు టిడిపి నేత బుద్దా వెంకన్న. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు విజయసాయి రెడ్డి అంటూ ఆగ్రహించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబును వైసిపి ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని సిపి నీ కోరామన్నారు.
పోలీసులు స్పందించకుంటే,కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తానని… అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిందని తెలిపారు. చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయి… విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహించారు. విజయసాయి రెడ్డి, జగన్ స్కాంలో జైలుకు వెళతారని తెలిసి ముందుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలిపారు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విషప్రచారం చేశాడని ఆగ్రహించారు. వైసిపి పార్టీ టైటానిక్ షిప్ లా ముంగిపోయింది… కమ్మకులానికి చెందిన ఆస్తులు లాక్కుంటే చంద్రబాబు వాళ్లకు అండగా నిలబడకూడదా అంటూ ప్రశ్నించారు.