హైదరాబాద్ లో వాహనదారులకు అలర్ట్..ఇవాళ రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్ లో వాహనదారులకు అలర్ట్.. ఇవాళ రాత్రి వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు మేరకు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటన చేశారు. నేడు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Big alert for motorists Traffic restrictions 

ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటలకి అమలులో ఉండనున్నాయి ట్రాఫిక్ ఆంక్షలు. అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పై సిఎం రేవంత్ ప్రకటన చేస్తారు. సాయంత్రం సచివాలయం లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది.

లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఉంటుంది. జయ జయహే తెలంగాణ కవి అందే శ్రీ ..విగ్రహ రూపకర్త ప్రో . గంగాధర్..రమణారెడ్డి లకు వేదిక మీద ప్రభుత్వం తరుపున సన్మానం చేస్తారు. తెలంగాణ లో ప్రజల పక్షం వహించిన ఐదారుగురు కవులకు సత్కరించే ఆలోచన లో ప్రభుత్వం ఉంది. బండి యాదగిరి..గూడ అంజన్న, జయరాజ్..గద్దర్ కుటుంబం లాంటి కవులకు సముచితంగా గౌరవించాలని ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news