ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. డబ్బులు లేకపోతే సంతోషం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సంపాదించే డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుని ఖర్చు చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఖర్చులను అదుపు చేయడం కోసం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సొంత ఇల్లు లేని వాళ్ళు నెలవారి బడ్జెట్లో ఇంటి అద్దె ఎక్కువవుతుంది. మీ ఆఫీస్ కి, పిల్లలు స్కూల్ కి కొంచెం దూరం ఎక్కువైనా తక్కువ అద్దెకి లభించే ఇంట్లో ఉండడం మంచిది. దీని వలన నెల ఖర్చుల్లో ఎక్కువ భాగం ఆదా చేసుకోవడానికి అవుతుంది. అలాగే అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండండి.
ఆహారం కోసం బయట రెస్టారెంట్లకి వెళ్లడం వంటివి తగ్గించడం మంచిది. ఇంట్లోనే వంట చేసుకోవడం వలన ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొంతమంది కొంచెం డబ్బు వచ్చేసరికి కారు కొంటారు. వాడినా, వాడకపోయినా పార్కింగ్, మెయింటెనెన్స్ ఛార్జీలు, సర్వీసింగ్, బీమా ఇలాంటివి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. దాని బదులు క్యాబ్ సర్వీస్ ఉపయోగిస్తే ఖర్చు కంట్రోల్ లో ఉంటుంది. మీరు షాపింగ్ కి వెళ్ళినప్పుడు కావాల్సిన వస్తువులు లిస్టు రాసుకుని పట్టుకెళ్ళండి. అప్పుడు అనవసరమైనవి కొనరు.
లిస్టులో ఉన్న వాటిని మాత్రమే కొంటారు ఇలా కూడా మీరు మీ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. ఎవరికైనా జీవిత బీమా అవసరం చాలామంది బీమా ఏజెంట్ల ద్వారా పాలసీలు తీసుకుంటూ ఉంటారు. బీమా కవరేజీ, రాబడి, తక్కువ బీమా కోసం ఆన్లైన్ టర్మ్ పాలసీ ని ఎంచుకోవచ్చు. ఖర్చులను తగ్గించాలంటే కార్డు చెల్లింపులు మానేయండి. డబ్బును ఉపయోగించండి. కరెన్సీని ఉపయోగించడం వలన డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఆ ధరను ఆన్లైన్ లో ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఎక్కడ తక్కువకొస్తే అక్కడ కొనుగోలు చేయండి. ఇలా మీరు మీ డబ్బులు సేవ్ చేసుకోవడానికి అవుతుంది.