తెలంగాణ తల్లి విగ్రహం ఇటీవల ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో ఉన్న విగ్రహం కంటే చాలా భిన్నంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా… కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం… జరిగింది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండే పాఠ్యపుస్తకాలలో ఈ జయ జయహే తెలంగాణ, తెలంగాణ తల్లి ఫోటో ఖచ్చితంగా కనిపించబోతుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే దీనిపై గులాబీ నేతలు మండిపడుతున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని… అప్పుడు కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ కు పంపిస్తామని హెచ్చరించారు కేటీఆర్.