Allu arjun: రాత్రి జైల్లో ఉన్న అల్లు అర్జున్ కు నరకం కనిపించినట్లు చెబుతున్నారు. నిన్న భోజనం చేయకుండా, నేలపై నిద్ర పోయారట అల్లు అర్జున్. ఇక… నిన్న ఒక్కరోజు చంచల్గూడా జైల్లో అల్లు అర్జున్ ఉన్న నేపథ్యంలో… ఆయనకు అండర్ ట్రయల్ ఖైది నెంబర్ 7697 ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి జైల్లో ఉన్న అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ లో ఉండటం జరిగింది.
రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్లోనే ఉంచారు. ఆ తర్వాత సమయం పూర్తికాగానే మంజీరా బ్యారక్ లోకి పంపించారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల తర్వాత విడుదల చేస్తారు. ఇక అటు చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. ఇంటికి వెళుతున్నారు. కుటుంబ సభ్యుల తో కలిసి… విడుదలైన అల్లు అర్జున్.. ఇంటికి వెళుతున్నారు.