చంచల్ గూడ జైలులో నుంచి విడుదలైన అల్లుఅర్జున్ సంధ్య థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. బాధిత రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ వెల్లడించారు. తను బాగున్నానని, తన కోసం వచ్చిన ఫ్యాన్స్ అందరికీ అభివాదాలు చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలాఉండగా, అల్లు అర్జున్ ఇంటికి దర్శకుడు సుకుమార్ కొద్దిసేపటి కిందటే చేరుకున్నట్లు తెలుస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక తన అభిమాన హీరోను పరామర్శించేందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే జైలు నుంచి విడుదయ్యాక తన భార్య బిడ్డలను పట్టుకుని బన్నీ ఎమోషనల్ అయ్యారు. ఇటువంటి పరిస్థితి తనకు ఎప్పుడు ఎదురుకాలేదని తన సన్నిహితులతో అల్లుఅర్జున్ బాధపడినట్లు సమాచారం.