అల్లుఅర్జున్‌ను కలిసిన చిరంజీవి సతీమణి సురేఖ

-

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌ను తన మేనత్త, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ శనివారం ఉదయం బన్నీ ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అల్లుఅర్జున్ జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదల అయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయనకు మధ్యంతర బెయిల్ రాగా పోలీసులు ఆలస్యం చేయడం వల్లే ఒక రాత్రి స్టార్ హీరో జైలులో ఉండాల్సి వచ్చిందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

అరెస్టు గురించి తెలియడంతో నిన్న సాయంత్రం చిరంజీవి, నాగబాబు
బన్నీ ఇంటికి వెళ్లి మాట్లాడివచ్చారు. అల్లు అర్జున్ ఇంటికి వచ్చారనే విషయం తెలియడంతో సురేఖతో పాటు పలువురు ప్రముఖలు సైతం బన్నీని పరామర్శించడానికి వస్తున్నారు. కాగా, అల్లుఅర్జున్ మీద నమోదైన కేసును వెనక్కి తీసుకుంటానని మృతురాలు రేవతి భర్త భాస్కర్ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news