గ్రీన్ ఛానెల్ ద్వారా..మెస్ ఛార్జీలు చెల్లిస్తాం – మంత్రి పొన్నం

-

గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (బాయ్స్) షేక్ పెట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ ంసదర్బంగగా గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ponnam prabhakar on mess

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ లలో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రులు ,ఎమ్మెల్యేలు ఈరోజు హాస్టల్ లలో సందర్శిస్తున్నారన్నారు. గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటున్నామని… ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి మా భవిష్యత్ మీద అని అభయమిచ్చి ఇక్కడ చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది… ఉపాధ్యాయులకు ప్రమోషన్ లు ఇచ్చి బదిలీలు చేసి నియామకాలు చేపట్టి అధ్యాపకవర్గ అసహనాన్ని తొలగించామన్నారు. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు… అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 25 వేల పాఠశాలకు 11 వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news