గుంటూరు జిల్లా తెనాలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో రోడ్డు ప్రమాదం జరుగగా..గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన యువతి దుర్మరణం చెందింది. ఈ సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగ శ్రీ వందన పరిమళ (26).
అయితే…. అమెరికాలో ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబరులో వెళ్లింది నాగ శ్రీవందన పరిమళ. టెన్నెసీ రాష్ట్రంలో చదువుతోంది నాగ శ్రీవందన పరిమళ. శుక్రవారం నాగ శ్రీవందన పరిమళ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టడంతో గాయాలపాలై మృతి చెందింది. దీంతో… నాగ శ్రీవందన పరిమళ విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు అక్కడి అధికారులు. విద్యార్థి నాగ శ్రీవందన పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తానా ప్రతినిధులు.