భార్య భర్తల గొడవలో ఓ ఎస్‌ఐ తలదూర్చాడు. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యభర్తల పంచాయితీలో ఎస్ఐ క్రాంతి కిరణ్ రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ప్రధానంగా ఆరోపించాడు.
అంతకుముందే రూ.15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని యువకుడు వేడుకున్నా వినడం లేదని సమాచారం.
డబ్బులు ఇవ్వలేదని పోలీసులు తనను దారుణంగా కొట్టారని గిరిజన యువకుడి పేర్కొన్నాడు. ప్రస్తుతం తీవ్రగాయాల పాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుండగా.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యుల డిమాండ్ చేస్తున్నారు.
భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ.. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి
మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో భార్యా భర్తల పంచాయితీలో రూ.20 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్.
అంతకు ముందే రూ.15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు.… pic.twitter.com/99KvvHgdsD
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024