2027లోనే తెలంగాణలో ఎన్నికలు రావాలని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని జనాలు కోరుకుంటున్నారు.. 2027 లో ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బి.ఆర్.ఎస్ ది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తు ఓడగొడుతారని హెచ్చరించారు. BAC లో చర్చ జరగకుండా అసెంబ్లీ లో ఎజెండా ఎలా పెడతారని నిలదీశారు. టూరిజం మీద చర్చ కాదు..లగచర్ల బాధితుల మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి కి ఓటు వేసినందుకు లగచర్ల వాసులకు బేడిలు వేశారు..వాళ్ళు ఏమి తప్పు చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని కోరారు. రేవంత్ రెడ్డి అల్లుడు, అదానీ కోసం భూములు గుంజుకుంటున్నారని ఆగ్రహించారు. హరి నాయక్ కు గుండె పోటు వస్తే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.