డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కాంగ్రెస్ రంగులు వేయడంపై… కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్చ్.. కష్టం రేవంత్.. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఆయన నిర్మించిన ఇళ్ళకు సున్నాలు వేసి.. ఇందిరమ్మ ఇళ్లని ప్రజల కళ్లకు గంతలు కట్టలేవని చురకలు అంటించారు. గోసపడ్డ ప్రతి గుండెకు తెలుసు అన్నారు.
ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఆయన పడ్డ తపన అని…. ప్రతి పేదవాడి కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు…కేసీఆర్ కల అని తెలిపారు. ఎన్నాళ్లున్నా ఆ నిర్మాణాలకు మీరు కేవలం పెయింటర్లు మాత్రమే అంటూ చురకలు అంటించారు కేటీఆర్. ఎప్పటికీ మీరంతా సున్నాల వేసే సన్నాసి బ్యాచ్ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పేరు మరిచిపోయేలా చేయలేవని వెల్లడించారు కేటీఆర్.
ప్చ్.. కష్టం రేవంత్.. !
కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదు..
ఆయన నిర్మించిన ఇళ్ళకు సున్నాలు వేసి..
ఇందిరమ్మ ఇళ్లని ప్రజల కళ్లకు గంతలు కట్టలేవు..గోసపడ్డ ప్రతి గుండెకు తెలుసు
ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఆయన పడ్డ తపనప్రతి పేదవాడి కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు…కేసీఆర్ కల… pic.twitter.com/All7BUu6Lq
— KTR (@KTRBRS) December 16, 2024