రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లను విడుదల చేస్తామని స్పష్టంచేశారు.
ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహాణ చేపడుతున్నాని వివరించారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు.దశల వారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు మండలి వేదికగా క్లారిటీ ఇచ్చారు. గత పదేళ్లలో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ ఒక్క డీఎస్సీ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక డీఎస్సీ భర్తీతో పాటు నియామక పత్రాలు కూడా అందజేసినట్లు డిప్యూటీ సీఎం స్పష్టంచేశారు.