బూతులు మాట్లాడే వారికే మైక్ ఇస్తున్నారు : మాజీమంత్రి జగదీష్ రెడ్డి

-

శాసనసభలో బూతులు మాట్లాడే వారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం ఇస్తున్నారని, ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకూడదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ సీనియర్ సభ్యులు మాట్లాడేందుకు టైం ఇవ్వాలని అడిగితే మీ పేరు లేదని చెప్పి, అధికార పక్షం వాళ్లకి పేరు లేకున్నా బూతులు మాట్లాడే వారికి స్పీకర్ సమయం ఇస్తున్నారన్నారు.

అంతేకాకుండా మా ప్రశ్నలు వచ్చే సమయానికి సభను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు.స్పీకర్ ప్రభుత్వంలో భాగం కాకూడదని హితవు పలికారు.ఏది ఏమైనా.. లగచర్ల, దిలావర్ పూర్, రామన్నపేట ఘటనలతో పాటు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక ఘటనలపై మా పోరాటం కొనసాగుతుందన్నారు.ప్రజలను హింస పెడుతున్న అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉంటామన్నారు. మేము హింస పడటానికైనా సిద్దంగా ఉన్నాం. కానీ, ప్రజలను ఇబ్బందులు పడనీయమని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news