మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు ఇష్యూ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటం పై కేసు నమోదు నేపథ్యంలో లుక్ అవుట్ నోటీస్ జారీ అయ్యాయి. 2 దఫాలుగా 1.70 కోట్లు చెల్లించిన పేర్ని నాని… ఈ నెల 13 కోటి, నిన్న 70 లక్షల డీడీ లు అందజేశారు. ఇక అటు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో గోదాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అసలు గోదాములో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై లోతైన విచారణ చేపట్టారు అధికారులు. 3200 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు లేఖ రాశారు పేర్ని నాని. అధికారుల పరిశీలన లో 3708 బస్తాలు తగ్గినట్టు గుర్తించారు అధికారులు. దీంతో మరోసారి ఎంత బియ్యం తగ్గిందనే దానిపై విచారణ చేయనున్నారు అధికారులు. ఇలాంటి తరుణంలోనే.. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు ఇష్యూ అయ్యాయి.