Dacoit: అడవి శేషుకు హీరోయిన్‌ దొరికింది !

-

Mrunal Thakur Joins Adivi Sesh in Indian Action Drama Dacoit: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ఎంపికలో ఆయన రూటే సపరేటు. ఒక్కో సినిమా ఒక్కో జానర్‌లో ఉంటుంది. ఇక థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన శేష్ సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తాజాగా అడివి శేష్ నటిస్తున్న మూవీ డకోయిట్. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. అయితే.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ బర్త్‌ డే నేడు. ఈ సందర్భంగా అడివి శేష్ నటిస్తున్న మూవీ డకోయిట్ నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చింది.

decoit

టాలీవుడ్ నటుడు అడివి శేష్ హీరోగా ఈ సినిమాలో చేస్తుంటే.. హీరోయిన్‌ తాజాగా అనౌన్స్‌ చేశారు. మృనాల్ ఠాకూర్ ప్రధాన హీరోయిన్‌ గా కనిపించనుంది. మొదట ఈ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్‌ గా అనౌన్స్‌ చేశారు. టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. కానీ చివరకు శృతి హాసన్ స్థానంలో మృనాల్ ఠాకూర్ వచ్చింది. ఈ మేరకు తాజాగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌ అన్నట్లు రివీల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news