ఛీడో తుఫాను ధాటికి ఫ్రాన్స్ కి చెందిన ఓవర్సీస్ ప్రాంతమైన మయోట్ దీవులు అతలాకుతలమయ్యాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో ఫ్రాన్స్ కి భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన మేర సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. తన ఆలోచనలు అన్నీ బాధిత కుటుంబాలపై ఉన్నాయని తెలిపారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సారథ్యంలో ఈ విషాదాన్ని ఫ్రాన్స్ అధిగమిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
హిందూ మహాసముద్రంలోని మయోట్ దీవులలో చిడో తుఫాను సోమవారం సృష్టించింది. తుఫాన్ దాటికి దీవి మొత్తం చిగురుటాకుల వణికిపోయింది. గడిచిన వందేళ్లలో ఈ స్థాయిలో తుపాను రావడం ఇదే తొలిసారి. తుపాన్ తీవ్రత తెలుసుకున్న ప్రాన్స్ ఆగమేఘాల మీద సహాయక చర్యలు ముమ్మరం చేసింది. అక్కడ ఉన్న వారిని రక్షించేందుకు నౌకలను, మిలటరీ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది.