Ind vs Aus 3rd Test: టీమిండియా ఆలౌట్ అయింది. గబ్బా టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లోనే టీమిండియా ఆలౌట్ అయింది. 260 పరుగులు చేసిన టీమిండియా…కూప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్ లో…. 78.5 ఓవర్లు ఆడిన టీమిండియా… 260 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇవాళ ఉదయం మ్యాచ్ ప్రారంభం కాగానే ఆకాష్ దీప్ వికెట్ ను హెడ్ పడగొట్టాడు.
హెడ్ బౌలింగ్ లో ఆకాష్.. స్టంప్ అవుట్ కావడం జరిగింది. దీంతో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు అలౌట్ కావడంతో… ఆస్ట్రేలియా కంటే 185 పరుగులు వెనుకబడిపోయింది టీమిండియా. అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం చేసే ముందే… వర్షం అడ్డంకి గా మారింది. దీంతో రెండవ ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇవాళ వర్షం జోరుగా పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ మూడవ టెస్ట్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.