ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఏపీకి వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది వాతావరణ శాఖ. తీవ్ర అల్పపీడనం బలపడి తమిళనాడు తీరం వైపు పయనిస్తుందని IMD అంచనా వేస్తోంది.
ఈ అల్పపీడన ప్రభావంతో….. నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమ భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నేడు కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు IMD అంచనా వేస్తోంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది IMD. తీరం వెంబడి 35 -45 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.