అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఫోక్ సింగర్ ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన శృతికి ఇన్స్టా లో పరిచయం అయిన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే 20 రోజుల క్రితమే అతడిని పెళ్లి చేసుకున్నది సింగర్ శృతి.
ఇంతలోనే కట్నం కోసం భర్త, అత్త మామలు వేధింపులకు దిగారు. దీంతో ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది శృతి. అయితే, వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శృతి తరుపు బంధువుల ఆరోపిస్తున్నారు. హెచ్ఎంటీవీలో మాట పాట ప్రోగ్రామ్ లో పలు సాంగ్ లను పాడి చాలా ఫేమస్ అయింది. ఇప్పటికీ ఫోక్ సింగర్ శృతి సాంగ్స్ అని సెర్చ్ చేస్తే పలు పాటలు మనకు దర్శనిస్తుంటాయి.