- జనసేన నేత పుట్టినరోజున..అశ్లీల నృత్యాల కలకలం
- క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో పలువురు యువతులతో పార్టీ..
- పార్టీలో అశ్లీల నృత్యాలు చేయడంపై విమర్శలు
ఏపీలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో యువ నాయకుడు వాకమూడి ఇంద్ర జన్మదినం సందర్భంగా రైస్ మిల్లులో రేవ్ పార్టీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనసేన నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు బయటపడ్డాయి.
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు బయటపడటం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర జన్మదినం సందర్భంగా క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో రేవ్ పార్టీ నిర్వహించారట ఇంద్ర. ఈ రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ వీడియో బయటకు రావడంతో.. జనసేన పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.
ఏపీలో రేవ్ పార్టీ కలకలం
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో యువ నాయకుడు వాకమూడి ఇంద్ర
జన్మదినం సందర్భంగా రైస్ మిల్లులో రేవ్ పార్టీ pic.twitter.com/nEtpT06QMY— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024