సినీ ఇండస్ట్రీలో వరుసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో మనిషి జీవించడం అనేది ఒక సవాలుగా మారిపోయింది.. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియకుండానే జీవితాలు కూడా ముగిసిపోతున్నాయి.. గంట ముందు వరకు అంతా ఓకే అనుకున్న ప్రాణాలు కూడా గంట తర్వాత తలకిందులు అవుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.
అయితే.. తాజాగా ‘బలగం’ సినిమా ఫేం మొగిలయ్య మృతి చెందాడు. బలగం సినిమాతో పాపులర్ అయిన మొగిలయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే ‘బలగం’ సినిమా ఫేం మొగిలయ్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన ఆరోగ్యం విషమించడంతో… ఇవాళ ఉదయమే ‘బలగం’ సినిమా ఫేం మొగిలయ్య మరణించారు. ఇక మొగిలయ్య మృతిపట్ల సంతాపం తెలిపింది బలగం సినిమా డైరెక్టర్ వేణు, మూవీ టీం.